ఎంపీటీసీ ఎడ్ల సుగుణ రాంరెడ్డి, ఎడ్ల రాంరెడ్డి మా మీద చేసినటువంటి ఆరోపణలపై గ్రామ నడిబొడ్డున బొడ్రాయి వద్ద చర్చలకు సిద్ధం అని కాచారం సర్పంచ్ కొండం అరుణ అశోక్ రెడ్డి, అశోక్ రెడ్డి లు అన్నారు. గురువారం, యాదగిరిగుట్ట మండలంలోని కాచారం గ్రామంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మేము కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ లోకి డబ్బులు తీసుకొని పార్టీ మారము అని మా మీద లేని ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. అని అన్నారు. ఎటువంటి వాస్తవాలు నిరూపించకుండా నాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోపణలను నిరూపించాలి, లేధంటే మన గ్రామం లోని ప్రజల అందరి సమక్షంలో మన గ్రామ దేవత దుర్గమ్మ తల్లి గుడి దేవాలయం వద్ద తాడి బట్టలతో ప్రమాణానికి సిద్ధం కావాలి. అదే విధంగా మన కాచారం గ్రామ లోని అభివృధి కోసమే మేము పార్టీలోకి మారడం జరిగింది అన్నారు. మేము అభివృధి చేసిన పనులు కూడా మా గ్రామ ప్రజలందరికీ తెలుసు, అభివృద్ధి పనులు కూడా ప్రజలకు కనిపిస్తున్నాయి అన్నారు. మీరు ఎంపీటీసీ గా గెలిచి మన కాచారం గ్రామం లో ఒక అభివృద్ధి పని చేశార ప్రజలకు చూపించండి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పుట్ట శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్, నాయకులు దడిగే సిద్ధులు, సుంచు మల్లయ్య, ఏర్ల బాల్ రెడ్డి, ఇప్ప సుభాష్, కొండం నర్సిరెడ్డి, పోరెడ్డి సిద్ధులు, ఇప్పసోములు, సుంచు శంకరయ్య, మల్లయ్య శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.