– ఉత్తరప్రదేశ్‌లో ఐక్యమవుతున్న రైతులు, ఉద్యోగులు
– భారీ ర్యాలీలు, నిరసనలకు ప్రణాళిక
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, ఉద్యోగులు భారీ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. పాత పెన్షన్ స్కీమ్ (ఒపిఎస్) పునరుద్దరించాలని ఉద్యోగులు, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కల్పించాలని రైతులు ఈ ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణను చేయకుండా కేంద్ర, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావడం కూడా ఈ ఆందోళనల ప్రాథమిక లక్ష్యంగా చెబుతున్నారు. ఈ డిమాండ్లను సాధించడానికి, మద్దతును సమీకరించడానికి రాబో యే నెలల్లో ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా, దేశ రాజధాని లోనూ నిరసనలు, ర్యాలీలు నిర్వహించ నున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అయినా ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఉద్యోగుల సంఘాల నాయకులు విమర్శిస్తు న్నారు. దేశంలో నిరుద్యోగం రేటు తీవ్రస్థాయిలో ఉన్నా (7.5 శాతం) ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీకి పూనుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడంపై రైతు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీ కరణ తరువాత విద్యుత్ బిల్లులు అనేక రెట్లు పెరుగు తాయని, తద్వారా రైతులపై ఆర్థిక భారం పెరుగు తుందని నాయకులు పేర్కొన్నారు. రైతులు, ఉద్యో గులు ఈ ఆందోళనల్లో ఎంఎస్‌పి, ఒపిఎస్‌లతో పాటు స్థానిక సమస్యలను కూడా ప్రస్తావించ నున్నారు. పంట పొలాలను పశువులు నాశనం చేయడం, విద్యుత్ ఉద్యోగులను అకారణంగా సస్పెండ్ చేయడం వంటి సమస్యలు ఇందులో ఉన్నాయి. ఇటీవల సమ్మెలో పాల్గొన్న 121 మంది విద్యుత్ ఉద్యోగులను సస్పెండ్ చేశారని, వారిని ఇంకా విధుల్లోకి చేర్చుకోలేదని ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. ఒపిఎస్ అంశం రాజకీయ గేమ్ ఛేంజర్‌గా ఉద్యోగులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కారణంగానే బిజెపి ఓటమి పాల యిందని, ఒపిఎస్‌ను పునరుద్దరించకుంటే 2024 సాధారణ ఎన్నికల్లో బిజెపికి అదే గతి పడుతుందని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఆగస్టు 9న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ నిరసనను ప్రారంభిస్తారని సంఘాల నాయకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కార్ల, బైక్ ర్యాలీలతో పాటు నిరసన సభలు నిర్వహి స్తారని చెప్పారు. నవంబర్ 3న దేశ రాజధానిలో ఉద్యోగులు భారీ నిరసన ర్యాలీని నిర్వహించ నున్నారు. రైతులు కూడా మూడు విడతలుగా తమ ఆందోళనలు నిర్వహించనున్నట్లు రైతు సంఘాల నాయకులు చెప్పారు. ముందుగా మొదటి దశలో భాగంగా మేలో రైతులు ప్రజాప్రతి నిధులకు తమ డిమాండ్లపై వినతి పత్రాలు అందజే యనున్నారు. ఆగస్ట్‌లో జరిగే రెండో విడతలో స్థానికంగా నిరసనలు, రాల్యీలు నిర్వహించనున్నారు. ఇక చివరి, మూడో దశలో నవంబర్ 26 నుంచి 28 తేదీ వరకూ 72 గంటల పాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సమావేశం కానున్నారు. బిజెపి పాలనలో ఆరోగ్య సంరక్షణ, విద్య చాలా ఖరీదుగా మారాయని రైతులు, ఉద్యోగులు విమర్శిస్తున్నారు.