– డబ్బు సంచులతో పార్టీ కార్యకర్తలను లొంగతీసుకొని క్యాడర్ ను దెబ్బతిస్తున్న పల్లా
– జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
నవతెలంగాణ-చేర్యాల
భూ కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. చేర్యాల మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ భూ కబ్జా లకు పాల్పడినట్లు తనపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు ఆ ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రతి పక్షాలతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులను డబ్బులతో కొనుగోలు చేస్తూ పార్టీని మలినం చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.డబ్బు సంచులతో నియోజకవర్గంలోని క్యాడర్ ను పల్లా రాజేశ్వర్ రెడ్డి అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ బాగు కోసం సిఎం కేసీఆర్ అందరినీ ఏకం చేసి పార్టీలోకి తీసుకుంటే వారిని కుక్కలు, నక్కలు అని అవమా నపరిచారని,పల్లా మాటలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, రాజేశ్వర్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వయంగా జనగామ కౌన్సిలర్ దొడ్డి కొమురయ్య వారసుడుకి కాలేజీలో సిట్ ఇవ్వమంటే ఇవ్వని నువ్వు జనగామ నియోజకవర్గంలో ప్రజా సేవ ఏం చేస్తావంటూ నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏమిటో చెప్పాలని,ఉద్యమంలో మా పైన ఎన్నో కేసులు ఉన్నాయని మరి నిపైన ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలన్నారు.తాను ఎక్కడైనా భూ కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ప్రాణత్యాగానికి సిద్దం అంటూనే సీఎం కేసీఆర్ ప్రజలకు సేవ చేయడం నేర్పారు కాని, భూ కబ్జాలు నేర్పలేదన్నారు.కేసీఆర్ సైనికుడుగా చెప్తున్న కబ్జా ఎక్కడ చేశానో నిరూపించాలని ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే సవాల్ విసిరారు.లేని పక్షంలో ప్రతిపక్షాల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.అంతకు ముందు ఇటీవల ఎమ్మెల్యే సహకారంతో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మండల కేంద్రంలోని ఓ గార్డెన్ లో లర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఉల్లంపల్లి కరుణాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెడతల ఎల్లారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం, వైస్ చైర్మన్ పుర్మ వెంకట్ రెడ్డి, కొమురవెల్లి మండల అధ్యక్షులు గీసా బిక్షపతి, మద్దూరు మండల అధ్యక్షుడు మేక సంతోష్,దూలి మిట్ట మండల అధ్యక్షుడు మంద యాదగిరి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల్ నర్సయ్య, వీరన్న పేట సర్పంచ్ కొండపాక బిక్షపతి, మున్సిపల్ కౌన్సిలర్లు మంగోలు చంటి,ఆడెపు నరేందర్, పచ్చిమడ్ల సతీశ్, బీ ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.