మిరప తోటల్లో సంరక్షణ చర్యలు చేపట్టాలి..

– మహాదేవపూర్ హెచ్ఓ రమేష్
నవతెలంగాణ మల్హర్ రావు: మిర్చి తోటల్లో సంరక్షణ చర్యలు చేపట్టాలని మహాదేవపూర్ డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి రమేష్ రైతులకు సూచించారు. మండలంలోని ఆన్ సాన్ పల్లి, నాచారం గ్రామాల్లోని పలు మిరప తొలలు పరిశీలించారు.మిరప తోటల్లో బూడిద, తెగులు నివారణ ఎప్పటికప్పుడు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.తామర పురుగు ఉధృతి సూక్ష్మదాతు లోపాలపైన క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పలు సూచనలు ఇచ్చారు.
నివారణ అజాక్షిస్టోబిన్ 1మీ.లి, లేదా మైక్లోబ్ల్యూటానిక్ 0.4 గ్రా లేదా అజాక్షిస్టోబిన్ 11శాతం,టెబ్యూకొనజల్ 18.3 శాతంను 1.2 మీ.లి లేదా టెబ్యూకోజానల్ 50 శాతం,ట్రేప్రాక్షిస్టోబిన్ 18.2 శాతం, డైపేకనజోల్ 50 శాతం, ట్రైప్లాక్షిస్టిబిన్ 25 శాతం 0.5 మీ.లి లేదా అజాక్షిస్టోబిన్ 18.2శాతం,డైపేకొనజోల్ 11.4 శాతం 1 మీ.లి లేదా ప్రోక్లోరాజ్ 24.4 శాతం, టెబ్యూకోనజోల్ 12.1 శాతం, 2 మీ.లి ఒక లీటర్ నీటికి కలిపి 8 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచించారు.

Spread the love