నవతెలంగాణ-హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 16న రాష్ట్రానికి రానున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో బస చేయనున్నారు. ఈ నెల 16 నుంచి 21 వరకు ఆమె హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. అనంతరం ఏపీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.