ములుగు బీఆర్‌ఎస్‌ అధ్యక్షడు హఠాన్మరణం..

నవతెలంగాణ-హైదరాబాద్ : ములుగు: భారత రాష్ట్ర సమితి ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, జిల్లా పరిషత్‌ ఛైర్మన్ కుసుమ జగదీష్‌ హఠాన్మరణం చెందారు. ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హన్మకొండలోని అజారా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జగదీష్‌ ప్రాణాలు కోల్పోయారు. కాగా, కుసుమ జగదీష్‌ అకాల మరణంపట్ల బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగదీష్‌ క్రియాశీల పాత్ర పోషించారని సీఎం స్మరించుకున్నారు. జగదీష్‌ కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

Spread the love