నవతెలంగాణ – ఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవ్వనున్న గ్యాలంటరీ పతకాలు సాధించిన వారి జాబితాను ప్రకటించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం లభించింది. దేశం మొత్తం మీద ఒక్క పోలీసు అధికారికే రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం లభించడం విశేషం.