పత్రికా స్వేచ్ఛను జర్నలిస్టుగా కాపాడుకోవాలి: ప్రెస్ అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి

Press freedom should be protected as a journalist: Press Academy Chairman K. Srinivas Reddyనవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
సమాజంలో పత్రికా స్వేచ్ఛను కాపాడడంతోపటు జర్నలిస్టుగా తమ స్వేచ్ఛను తమ గౌరవాన్ని కాపాడుకోవాలని  తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు సాయి వృద్ధఆశ్రమం సహకారంతో వర్కింగ్ జర్నలిస్టులకు ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ అశోక్ ట్రస్ట్ సభ్యులు నూతనంగా నిర్మించిన భవనాన్ని,గోషాలను సందర్శించి ఆశ్రమంలో ఉన్న వసతులను పరిశీలించి ఆశ్రమానికి తోడ్పడుతానని హామీ ఇచ్చారు.ఇలాంటి ఆశ్రమం నడుపుతున్నందుకు సాయి యాదాద్రి సేవా సంస్థ డి అశోక్ బృందానికి  కృతజ్ఞతలు తెలిపారు.మండలంలోని వర్కింగ్ జర్నలిస్టులకు జీవిత బీమా పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మానవ సంబంధాలు బలహీన పడుతున్న దశలో రిటైర్డ్ ఉద్యోగులు ఇటువంటి ఆశ్రమాన్ని నిర్వహించడం చాలా శుభపరిణామాలని కొనియాడారు.అనంతరం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసి మాట్లాడుతూ సమాజంలో పత్రికా స్వేచ్ఛను కాపాడడంతోపాటు జర్నలిస్టుగా తమ స్వేచ్ఛను తమ గౌరవాన్ని కాపాడుకోవాలని అకాడమిక్ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో పత్రికలపై కఠిన నిర్ణయాలు  ఉండేటివి అని ఆయన వివరించి చెప్పారు.రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పత్రిక,ఎలక్ట్రానిక్ మీడియాను మూడు వర్గాలుగా విభజించి జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డ్స్,ఇళ్లస్థలాలు కేటాయించే అవకాశాలు ఉన్నాయని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.వర్కింగ్ జర్నలిస్టులుగా వాస్తవాలను గ్రహించి ప్రజలకు ఉపయోగపడే విధంగా కథనా రూపంలో వార్తలుగా రాయాలని ఆయన సూచించారు.గత కాలంలో జర్నలిస్టు అంటే సమాజంలో గౌరవంగా ఉండేదని అని అన్నారు.కానీ ప్రస్తుత రోజులలో జర్నలిస్టు అంటే గౌరవించే పరిస్థితి లేదని తెలిపారు.ఈమధ్య కాలంలో యూట్యూబ్ ఛానళ్లు,సోషల్ మీడియా వాడే భాష తీరు,ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చిత్రీకరిస్తున్నారనీ ఆయన తెలిపారు. పత్రికా స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆయన అన్నారు. కొన్ని సోషల్ మీడియా యూట్యూబ్ చానళ్లకు అక్రిడేషన్లు ఇద్దామా లేదా అనే డైలమాలో ఉందని ఆయన చెప్పారు.మనందరం వర్కింగ్ జర్నలిస్టుగా కలిసికట్టుగా పనిచేస్తే సాధించినది ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు.చౌటుప్పల్ మండల వర్కింగ్ జర్నలిస్టులు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కి శాలువతో సన్మానించి మెమొంటో ను అందజేశారు.ఈ కార్యక్రమానికి ఐజేయు యాదాద్రిభువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు దోనూరి రాంరెడ్డి అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరాసత్ అలీ ఐజేయు ఐజేయు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాయకులు పల్లె శేఖర్ రెడ్డి మోహన్ రెడ్డి రామలింగం మండలంలోని విలేకరులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love