అక్రమాలకు అడ్డుకట్టపడేనా.!?

– మండలంలో జోరుగా పిడిఎస్ ఇసుక మొరం దందా..
– గతంలో చూసి చూడనట్లుగా వ్యవహరించిన అధికారులు
– అ అసాంఘిక కార్యకలాపాలపై నూతన ఎస్సై దృష్టి సారించాల్సిందే.!?
నవ తెలంగాణ – కాటారం
కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమాలకు అడ్డుపడిన అనే చర్చ సాగుతోంది. ఇన్నాళ్లు మండల కేంద్రంగా పిడిఎస్ ఇసుక మొరం దందాకు కొదువు లేకుండా పోయింది. అడ్డుకునే వారే లేకపోవడంతో అక్రమార్కుల ఇష్టారాజ్యం జోరుగా సాగింది. మండల కేంద్రంలో ఓ అధికారి మూలంగా సర్వత్ర గతంలో విమర్శలు వెల్లువెత్తాయి. నూతన పోలీస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సబ్ ఇన్స్పెక్టర్ అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇకనుంచి అక్రమార్కుల ఆటలు చెల్లవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో అసాంఘిక కార్యక్రమాలపై కొత్త ఎస్ఐ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– నూతన ఎస్సైగా అభినవ్..
కాటారం మండల నూతన ఎస్సైగా అభినవ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాటారం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గడ్డం శ్రీనివాసులు భూపాల్ పల్లి వి ఆర్ కు బదిలీ కావడంతో గణపురం ఎస్సైగా ఉన్న అభినవ్ కాటారం ఎస్సై గా బదిలీ అయ్యారు.
సమస్యలు సవల్లే
మంథని నియోజకవర్గంలోనే అతిపెద్ద మండలమైన కాటారం మండల కేంద్రంలో బొగ్గు, ఇసుక లారీలతో ట్రాఫిక్ నియంత్రణ ప్రతి ఎస్సైకి కత్తి మీద సాముగా మారింది. కాటారం మండలానికి వచ్చిన ప్రతి ఎస్సై తమదైన శైలిలో ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేశారు. ఐదు మండలాలకు కేంద్రబిందువైన కాటారంకు సరైన బస్టాండ్ సౌకర్యం లేక ఆర్టీసీ బస్సులు, ఆటోలు, లారీలు ప్రైవేటు వాహనాలు అడ్డదిడ్డంగా ఉంటాయి. మండలంలో అతివేగంగా వెళ్లే ఇసుక లారీలు, మట్టి ట్రాక్టర్లను, ఇసుక తరలించే ట్రాక్టర్లను నియంత్రణ లేకుండా పోయింది. వీటిపై నూతన ఎస్సై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Spread the love