కొత్త నిర్మాణాలపై శ్రద్ధ చూపని గత ప్రభుత్వాలు

– 60 ఏండ్లనాటి మూడు ఓటీలు మాత్రమే
– బీఆర్‌ఎస్‌ పాలనలో అధునాతన రోబోటిక్‌, మాడ్యులర్‌ థియేటర్లు
– ఎంఎన్‌ జే క్యాన్సర్‌ ఆస్పత్రి స్వరూపాన్ని మార్చేశాం : మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆస్పత్రుల్లో కొత్త నిర్మాణాలపై గత ప్రభుత్వాలు శ్రద్ధ చూపలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. సోమవారం హైదరా బాద్‌ ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో రోబోటిక్‌ సర్జికల్‌ సిస్టంతో పాటు లాప్రోస్కోపిక్‌ పరికరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ముందు 60 ఏండ్ల క్రితం ఏర్పాటు చేసిన మూడు ఆపరేషన్‌ థియేటర్లు మాత్రమే ఉండేవనీ, ఆ ఓటీ కాంప్లెక్స్‌లో కూడా సరైన వసతులు, ఎయిర్‌ ఫ్యూరిఫికే షన్‌, స్టాండ్లు, సరైన వెంటిలేషన్‌ సెంటర్‌ ఏసీ లేక సమస్యలుండేవని గుర్తుచేశారు. ఇప్పటికే ఆస్పత్రిలో 8 అధునాతన రోబోటిక్‌, ఎనిమిది మాడ్యులర్‌ థియేటర్లను ప్రారంభించి నట్టు తెలిపారు. రూ.32 కోట్లతో రోబోటికల్‌ సర్జికల్‌ పరికరం సమ కూర్చినట్టు చెప్పారు. మరింత కచ్చితం గా ఆపరేషన్లు చేయడం దీనితో సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్రం వచ్చాక కొత్త రేడియేషన్‌ ఎక్విప్‌మెంట్‌, లైనాక్‌, పీఈటీ సీటీ, సీటీ స్కాన్‌ మిషన్‌, మాడ్యులర్‌ ల్యాబ్స్‌ తీసుకొ చ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారి ఎంఎన్‌జే ఆధ్వర్యంలో అంకాలజీ స్పెషల్‌ నర్సింగ్‌ స్కూల్‌ను త్వరలో ప్రారంభిం చుకోనున్నట్టు తెలిపారు.
20 జిల్లాల్లో మొబైల్‌ స్క్రీనింగ్‌ క్యాంపులను నిర్వహించి 200 మంది బాధితులను గుర్తించి వారికి చికిత్స నందిస్తున్నట్టు తెలిపారు. రూ.120 కోట్లతో ఎంఎన్‌ జే క్యాన్సర్‌ ఆస్పత్రిని స్టేట్‌ క్యాన్సర్‌ సెంటర్‌గా తీర్చిదిద్దు తున్నట్టు చెప్పారు. ప్రయివేటులో రూ.25 లక్షల ఖర్చయ్యే బోన్‌ మారో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ చికిత్సలు ఆరు నెలల్లో 30 కేసులు చేయగా 98 శాతం సక్సెస్‌ రేటు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్‌ జే క్యాన్సర్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ జయలత తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love