– తహసీల్ ఎదుట సీపీఐ(ఎం) ధర్నా
నవతెలంగాణ-కూసుమంచి
మండలంలో అన్ని గ్రామాల్లో అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ బందు, నూతన రేషన్ కార్డులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ మంజూరు చేయాలని కోరుతూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి యడవల్లి రమణారెడ్డి మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, వ్యతిరేకిస్తూ… విపరీతంగా పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మండల ఇన్చార్జి తుశాకుల లింగయ్య మాట్లాడుతూ… పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఏ పనినైనా, పథకమైనా గ్రామ సభల ఆమోదంతో అమలు జరపాలని లేని చట్ట అతిక్రమణకు పాల్పడినట్లవుతుందని, పథకం పొందిన లబ్దిదారులు కూడా అనర్హులవుతారని, వివిధ పేర్లతో ఏదో కొద్దిమందికి అక్కడక్కడ ఇచ్చే పథకాలు కూడా పర్సంటేజీలు తీసుకుని పక్కా అధికార పార్టీల కార్యకర్తల ఇచ్చుకొంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎర్రబోయిన భారతి, పార్టీ మండల కమిటీ సభ్యులు శీలం గురుమూర్తి, తోటకూరి రాజు, మల్లెల సన్మమంతరావు, జవ్వాజి శ్రీను, వెంకన్న, మూడు గన్యా నాయక్, కర్ణబాబు, చీర్ల రాధాకృష్ణ, మల్లేపల్లి సర్పంచ్ పోట్టపింజర నాగేశ్వరావు, పందిరి వీరారెడ్డి, మాజీ సర్పంచ్ తాళ్లూరు రవి, హాలవత్ బాసునాయక్ వివిధ గ్రామల శాఖ కార్యదర్శులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలి
కల్లూరు: రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని, 14 రకాల నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఐద్వా మండల కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి, గొర్రెల మేకల సంఘం కార్యదర్శి బట్టు నరసింహారావు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు దోమ తొట్టి పుల్లయ్య, పార్టీ సభ్యులు నాయుడు చంద్ర రావు, రేసు నాగేశ్వరరావు, ముంత మల్లయ్య, తదితర పాల్గొన్నారు.
కొణిజర్ల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్నా ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కష్ణ మాట్లాడారు. అనంతరం ఇన్‌చార్జ్ తహసీల్దార్ ఎర్రయ్యకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బలమాల యోహాను, పగిడిపల్లి జయ, బాలమర్తి వెంకటి, జంగిలి నవీన్, తుపాకుల నాగయ్య, షేక్ ఆజాద్, పేరం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.