– నీట్ పరీక్ష లీకేజిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి
– లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా పట్టించుకోని కేంద్రం
– పీడీఎస్ యూ రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్
– లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా పట్టించుకోని కేంద్రం
– పీడీఎస్ యూ రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఎంబీబీఎస్, ఇతర వైద్యవిద్య కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన నీట్-యూజీ ఎంట్రన్స్ లో అవకతవ కలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న అనుమానాలు ఉన్న, దేశ ప్రధాని మోదీ స్పందించక పోవడాన్ని నిరసిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యూ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అరవై ఫీట్ల రోడ్డులో దగ్ధం చేయడం జరిగింది అని పీడీఎస్ యూ రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బిహార్ లో రూ.30 లక్షలకు నీట్ ప్రశ్నపత్రాలు విక్రయించారని, ఈ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ కేంద్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని నరేంద్ర మోడీ ప్రభుత్వం పై వారు మండి పడ్డారు. నిట్ పరీక్ష ఫలితాలలో 67 మందికి మొదటి ర్యాంకు ఎలా? నీట్ పరీక్షలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకులు రావడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. ఒకే సెంటర్ నుంచి పరీక్ష రాసిన 8 మంది విద్యార్థులు 720 మార్కులు సాధించడం చూస్తే బీజేపీ హయాంలో పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు. ఇప్పటికైనా నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (నీట్) చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలన్నారు. అలాగే మానిటరింగ్ చేయడంలో విఫలం చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు, విద్యార్థులు సంజాయిషీ కేంద్ర ప్రభుత్వం చెప్పి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలనీ కేంద్రం ప్రభుత్వన్ని డీమాండ్ చేశారు. నీట్ నిర్వహణలో వివాదాలు నిత్యం జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యార్థులు కోరుతున్నట్లు నీట్ ఎగ్జాంను రాష్ట్రాల పరిధిలోకి మార్చాలని , కోచింగ్ సెంటర్ల పేరుతో, కన్సల్టెన్సీల పేరుతో పెపర్ లికేజీలు చేస్తున్న నీట్ కోచింగ్ సెంటర్ల అమనుమతులు రద్దు చేసి పేపర్ లీకేజీ కి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నిట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వన్ని వారు డీమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ నాయకులు సురం విజయ్ రెడ్డి, బయ్య గణేష్,నిఖిల్, సిద్ధార్థ్,వంశి, క్రిష్ణ,సాయి కుమార్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.