అహ్మాదాబాద్: గ్లోబల్ మెడ్‌టెక్ కంపెనీ మెరిల్ పీఎల్‌ఐ పథకం కింద ఏర్పాటు చేసిన అధునాతన తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చ్యువల్‌గా ప్రారంభించారు. వాపిలోని మెరిల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి ప్రధాని సహా ఆ రాష్ట్ర సిఎం భూపేందర్‌భారు పటేల్ హాజరయ్యారని ఆ కంపెనీ తెలిపింది. భారత్‌లో ఇప్పటి వరకు రూ.1,400 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టామని మెరిల్ తెలిపింది.