Modi : 20 క్రిటికల్ కేర్ బ్లాక్ లకు శంకుస్థాపన చేశాం : ప్రధాని మోడీ

నవతెలంగాణ-హైదరాబాద్ : నిజామాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సశాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇందూరు ప్రజాగర్జన సభలో మాట్లాడారు ప్రధాని మోడీ. దేశంలో ఎయిమ్స్ సంఖ్యను పెంచామన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద 20 క్రిటికల్ కేర్ బ్లాక్ లకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన నేనే చేశాను.. నేనే ప్రారంభించాను అని తెలిపారు ప్రధాని. NTPC ప్లాంట్ వల్ల తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది అని తెలిపారు. 8వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించినట్టు తెలిపారు. నిజామాబాద్ మహిళలు పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికినందుకు ధన్యావాదాలు తెలిపారు ప్రధాని. దేశ మహిళలు ఇచ్చిన శక్తి వల్లనే మహిళా బిల్లు పాస్ చేయగలిగాను. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి సలాం చెప్పారు.

Spread the love