ప్రపంచం గర్వంచదగ్గ నాయకుడు ప్రధానీ మోడీ 

– మోడీ జన్మదిన సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ 
– పారిశుద్ధ్య కార్మికుల సేవలతో గ్రామాలు పరిశుభ్రం
– స్వంత ఖర్చులతో నిత్యావసర సరుకులు పంపిణీ
– పులిమామిడి (కిష్టాపూర్) మాజీ సర్పంచ్, దుబ్బాక నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ నాయిని రాజ గోపాల్ 
నవతెలంగాణ- దుబ్బాక రూరల్ 
పారిశుద్ధ్య కార్మికుల సేవలతో గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయి. వారి సేవలను గుర్తించి ప్రధాని మోడీ గ్రామ స్థాయిలో పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగారని పులిమామిడి (కిష్టాపూర్) మాజీ సర్పంచ్, దుబ్బాక నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ నాయిని రాజ గోపాల్ అన్నారు. మోడీ 73 వ  జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెళ్లి, శిలాజీ నగర్ గ్రామాలల్లో పులిమామిడి (కిష్టాపూర్) మాజీ సర్పంచ్,దుబ్బాక నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ నాయిని రాజ గోపాల్ తన సొంత ఖర్చులతో పారిశుద్ధ్య కార్మికులైన బాలయ్య, చెంద్రం ,ప్రభాకర్, రాజవ్వ , రత్నమ్మ, శ్యామల ,బాలవ్వ, దాస్, భానోజు శ్రీనివాస్, మాలోతు హుస్సేన్, మిరుదొడ్డి దుర్గవ్వ, పెంబర్తి రవిలకు పెద్దగుండవెళ్ళి ఎంపీటీసీ పరికి రవి గౌడ్, చెగుంట వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం ,కిసాన్ మోర్చా మాజీ జిల్లా కార్యదర్శి దుర్గయ్య లతో కలిసి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు విలేఖర్లతో మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రపంచం గర్వంచదగ్గ నాయకుడని కొనియాడారు. ఆయన జన్మదిన సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా 30 గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఉడత భక్తిగా పారిశుధ్య కార్మికుల నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రధాని మోడీ మూడో సారి నాయకత్వంలోకి రావడం ఖాయమని ధీమా   వ్యక్తం చేశారు. తదనంతరం ఎంపీటీసీ రవి గౌడ్ మాట్లాడుతూ తన కోరిక మేరకు కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద గుండవెళ్లి, శిలాజీ నగర్ గ్రామాల బూత్ అధ్యక్షులు సంతోష్, మల్లారెడ్డి, గూడ సంతోష్ రెడ్డి, నాయకులు కనకయ్య, అశోక్, సంజీవ్ రెడ్డి, తదితరులు ఉన్నారు .
Spread the love