నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ కొత్తగా ఆరు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ఆదివారం ఆ రైళ్లను వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఆరు రైళ్లు టాటానగర్ – పట్నా, బ్రహ్మపూర్ – టాటానగర్, రూర్కెలా – హౌరా, డియోగఢ్ – వారణాసి, భాగల్పూర్ – హౌరా, గయా – హౌరా లాంటి ఆరు కొత్త మార్గాల్లో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. వందే భారత్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే 24 రాష్ట్రాలు, పలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిత్యం 120 ట్రిప్పులతో ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వివిధ రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేశారు.