ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోడీ..

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాన మోడీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ… వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాబోయే కొన్ని రోజులు తాను ఫ్రాన్స్, అమెరికాలో ఉంటానని చెప్పారు.
ఫ్రాన్స్ లో జరిగే ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొంటానని పేర్కొన్నారు. ఇండియా-ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తో చర్చలు జరుపుతానని వెల్లడించారు. మార్సిల్లేలో కాన్సులేట్ ను కూడా ప్రారంభించనున్నట్టు కూడా తెలిపారు.
Spread the love