నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధాని మోడీ అన్నారు. ప్రత్యేక సెషన్ కాలవ్యవధి తక్కువే కావచ్చు కానీ సందర్భానుసారంగా పెద్దదని చెప్పారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్ ఆశాకిరణంగా మారిందని చెప్పారు. భారత ఉజ్వల భవిష్యత్తుకు జీ20 సదస్సు మార్గదర్శనం చేసిందన్నారు. కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని చెప్పారు. జాబిల్లిపై మన మిషన్ విజయవంతమైందని చెప్పారు. చంద్రయాన్-3తో మన జెండా సగర్వంగా రెపరెపలాడిందని పేర్కొన్నారు. చంద్రయాన్ విజయంతో దేశానికి పేరు, ప్రఖ్యాతులు వచ్చాయని వెల్లడించారు. శిశక్తిపాయింట్ నవ శకానికి స్ఫూర్తి కేంద్రాగా మారింది. ఇలాంటి విజయాలు సాధించినప్పుడే శాస్త్ర, సాంకేతికతలో మనమెంత ముందున్నామో ప్రపంచానికి తెలుస్తుంది. ఈ విజయంతో అనే అవకాశాలు భారత్ తలుపులు తడుతాయన్నారు. భారత్ పురోగతిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తున్నదని చెప్పారు.