ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇంగ్లీష్, తెలుగు భాషలలో ప్రధాని ట్వీట్ చేశారు. తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎల్బీ స్టేడియంకు తరలి వచ్చారు.

Spread the love