ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన రద్దు..!

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నవీకరణ ప్రాజెక్టు మార్చి 1న ప్రారంభించేందుకు మోడీ షెడ్యుల్ ఖరారైంది. ఈ మేరకు ప్రధాని బహిరంగ సభ కోసం ఏయూ మైదానంలో అధికారులు ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. అయితే, తాజాగా ప్రధాని పర్యటన రద్దయినట్టు ఢిల్లీ నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. దీంతో, అధికారులు ఏర్పాట్లను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, పర్యటన రద్దుపై అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.

Spread the love