యూఏఈ పర్యటనకు ప్రధాని

య్– రెండురోజులపాటు టూర్‌
దుబాయ్ :
ప్రధాని మోడీ 13, 14 తేదీల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) పర్యటనకు వెళ్లనున్నారు. తొలిరోజున యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌తో సమావేశమై విస్తృత చర్చలు జరుపుతారు.
అలాగే రాజధాని నగరమైన అబుధాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని మోడీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఉంటున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతారు. 2015 నుంచి యూఏఈకి ఇది ప్రధాని జరపనున్న ఏడో పర్యటనగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. మోడీ, అల్‌ నహ్యాన్‌ భేటీలో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం, బలోపేతం చేయడంపై నేతలిద్దరూ చర్చిస్తారు. ఉభయులకూ ప్రయోజనకరమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా వీరు మాట్లాడుకోనున్నారు. దుబారు కేంద్రంగా జరిగే వరల్డ్‌ గవర్నమెంట్‌ సమ్మిట్‌ – 2024కు గౌరవ అతిథిగానూ ప్రధాని హాజరై ప్రసంగిస్తారు.

Spread the love