నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్: ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఆ స్కూల్ ప్రిన్సిపల్ లైలంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. షాజహాన్‌పూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న వ్యక్తి విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించేవాడు. విద్యార్థినిపై లైలంగికదాడి చేసేవాడు. ఎవరికీ చెప్పొద్దని డబ్బులు కూడా ఇచ్చేవాడు. అయితే ప్రిన్సిపల్ వేధింపులు పెరగడంతో బాలిక ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.