అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ రోజా

నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట మండలంలోని పెద్దవాస ప్రాజెక్టులో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (మహిళ)లో అతిథి అధ్యాపకుల నియమకానికి గురుకుల సెక్రటరీ నవీన్ నికోలస్ గారి ఆదేశాల మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్  బి.రోజా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఖాళీల వివరాలు:
తెలుగు – 2, ఫిజిక్స్ -1,బోటనీ – 1, ఎకనామిక్స్ – 1, పొలిటికల్ సైన్స్ – 1,కంప్యూటర్ సైన్స్ – 2, జూవాలజీ -1.
ఈ పోస్టుల కోసం పీజీ నెట్,సెట్,పీహెచ్డీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల అనగా సెప్టెంబర్ 27 నుంచి 29 సాయంత్రం 4 గంటల వరకు తమ కళాశాలలో దరఖాస్తులు సమర్పించి సెప్టెంబర్ 30 వ తేదిన ఉదయం 10 గంటలకు కళాశాలలో నిర్వహించే డెమో కు హాజరు కాగలరని కోరారు.
సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్ లు
 1) 7036734942
2) 9381331472
Spread the love