ప్రయివేట్‌ విద్యా సంస్థలను నియంత్రించాలి

– ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి చాపిలే సాయికృష్ణ
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
జిల్లాలోని ప్రయివేట్‌ విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని వాటిని నియంత్రణ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి చాపి సాయికృష్ణ డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వసాకె సాయికుమార్‌తో కలిసి జిల్లా విద్యాధికారి అశోక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజుల నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న మన ఊరు మనబడి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు యూనిఫామ్‌లు అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సతీష్‌, జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్‌, జిల్లా కమిటీ సభ్యులు రాజేందర్‌, నాయకులు మణివర్మ పాల్గొన్నారు.

Spread the love