నవతెలంగాణ-ఆర్మూర్
ఎస్ఎఫ్ఐ,పిడిఎస్ యు విద్యార్థి నాయకులు వ్యక్తిగత కక్ష్యతో పట్టణంలోని మామిడిపల్లి నలంద పాఠశాల , యాజమాన్యాన్ని కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్దేశ్య పూర్వకంగా పుస్తక కేంద్రం విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నాను. నిజానికి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు, నలంద పాఠశాల పట్టణ శివారులో ఉండడం ,రవాణా సౌకర్యానికి ఇబ్బందుల దృష్యా . పుస్తకాలను పాఠశాలలోనే అందజేయడం జరిగింది. అని అన్నారుఈ విషయాన్ని అదునుగా తీసుకొని పాఠశాలకు వచ్చి యాజమాన్యంతో చర్చించకుండా పాఠశాలకు వచ్చి పాఠశాల అనుమతి లేకుండా వీడియోలు చిత్రీకరించి పాఠశాల ప్రతిష్టను భంగపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. అని అన్నారుపాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు మా అనుమతితోనే పుస్తకాలు అందిస్తున్నారు అని తెలిపినప్పటికీ ఆ మాటలను బేఖాతరు చేస్తూ తల్లిదండ్రులతో మరియు పాఠశాల సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు.విద్యార్థి సంఘాల నాయకుల ముసుగులో విద్యార్థులకు మంచి చేయకపోగ వాళ్ళ వ్యక్తిగత అవసరాల కొరకు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలను ఒత్తిడికి గురిచేస్తూ, వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటున్నారు. అని అన్నారు.