ప్రియాంక గాంధీ ధర్మపురి పర్యటన రద్దు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ధర్మపురి పర్యటన రద్దయింది. వర్షం కారణంగా హెలికాప్టర్ ప్రయాణం రద్దయి… రోడ్డు మార్గాన ప్రయాణిస్తూ సభలలో పాల్గొన్నారు. దీంతో ధర్మపురి సభకు హాజరు కాలేకపోయారు. ఆమె ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్ నుంచి పాలకుర్తికి హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో పాలకుర్తి చేరుకున్నారు. కొత్తగూడెం, హుస్నాబాద్ సభలలో కూడా పాల్గొన్నారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె హుస్నాబాద్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.

Spread the love