మరోసారి తెలంగాణ పర్యటనకు ప్రియాంక, రాహుల్ గాంధీ..

నవతెలంగాణ – హైదరాబాద్: మరోసారి తెలంగాణ పర్యటనకు AICC ప్రధాన కార్యదర్శి ప్రియాంక, రాహుల్ గాంధీ రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది. ముఖ్యంగా AICC ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మరోసారి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈనెల 24, 25 తేదీల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 24న హుస్నాబాద్, పాలకుర్తి, ధర్మపురి…. ఈనెల 25న ఖమ్మం, పాలేరు, వైరా, మధిర…. ఈనెల 27న గద్వాల, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభలకు ఆమె హాజరుకానున్నారు. ఇక అటు తెలంగాణ ప్రచారానికి మరోసారి రాహుల్ గాంధీ రానున్నారు. గెలుపు లక్ష్యంగా…. ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ…. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇక ఈ నెల చివర్లో తెలంగాణకు మరోసారి రాహుల్ గాంధీ రానున్నారు. నవంబర్ 25వ తేదీన మెదక్, తాండూరు మరియు ఖైరతాబాద్ నియోజకవర్గాలను రాహుల్ గాంధీ ప్రచారం చేయనున్నారు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ మూడు నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు రాహుల్ గాంధీ. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయినట్లు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

Spread the love