రోప్‌ స్కిప్పింగ్‌ విజేతలకు బహుమతుల ప్రదానం

Prize distribution for rope skipping winnersనవతెలంగాణ-ఘట్కేసర్‌
రోటర్‌ డ్యామ్‌ రాష్ట్రస్థాయి రెండో రోప్‌ స్కిప్పింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో గెలుపొందిన వారికి సోమవారం బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీలలో రోటర్‌ డ్యామ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. దేవేంద్ర విద్యాలయ స్కూల్‌ విద్యార్థులు ద్వితీయ స్థానంలో, మెరిడియన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు తతీయ స్థానంలో నిలిచారు. వారికి మేయర్‌ జక్కా వెంకటరెడ్డి ముఖ్యతిధిగా హాజరై ట్రోఫీలు అందజేశా రు. కార్యక్రమానికి రోటర్‌ డ్యామ్‌ ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి, తెలంగాణ రోప్‌ స్కిప్పింగ్‌ జనరల్‌ సెక్రటరీ భాను ప్రకాష్‌ నాయర్‌, పీర్జాదిగూడ కార్పొరేటర్‌ శారదా ఈశ్వర్‌రెడ్డి, రోటర్డ్యామ్‌ డైరెక్టర్‌ శ్వేతారెడ్డి, హాజరయ్యారు. అంతకుముందు జక్కా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులందరూ ”ఒక మంచి అభిరుచితో ఆశయ సాధనే తమ లక్ష్యంగా పాల్గొన్నారని చెప్పారు. రోప్‌ స్కిప్పింగ్‌ జనరల్‌ సెక్రటరీ భానుప్రకాష్‌ నాయర్‌ మాట్లాడుతూ.. గతేడాది ఈ ఏడాది ఎక్కువ మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనడం ఆనందకరం అన్నారు.

Spread the love