నవతెలంగాణ – పెద్దవూర
మండలం లోని పాల్తితండ గ్రామంలో” యువశక్తి ” వారి ఆధ్వర్యంలో పాల్తి శంకర్ నాయక్ సాకారంతో మంగళవారం సంక్రాతి సందర్బంగా మహిళలకు ముగ్గుల పోటీలు దాతల సహకారం తో నిర్వహించారు.గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు కార్యకర్తలు జడ్జిగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. ఈ పోటీలలో మొదటి బహుమతి రూ.1050 పాల్తీ సరిత, రెండవ బహుమతి 716 దేవగత్ వెన్నెల,మూడవ బహుమతి 516 పాల్తీ స్రవంతి, నాలుగవ బహుమతి 316 పాల్తీ సుజాత, ఐదవ బహుమతి 250 రూపాయలు నేనావత్ బేబీ, మిగితా వారికీ ఒక్కొక్కరికి రూ.100 చొప్పున అందజేశారు. మొదటి బహుమతి దాత పాల్తి శంకర్ నాయక్,రెండవ బహుమతి అంగోతు సేవ నాయక్ మూడవ బహుమతి దేగవత్ జగన్ నాయక్,నాలుగవ బహుమతి పాల్తి హరిలాల్ నాయక్, ఐదవ బహుమతి పాల్తి శంకర్ నాయక్, ఆరవ బహుమతి పాల్తి కృష్ణా నాయక్,షీల్డ్ దాతలు పాల్తి శంకర్ నాయక్, పాల్టీ రవి నాయక్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్తివీరా సింగ్, రఘు నాయక్, కోటేశ్ నాయక్, రమేష్ నాయక్, సురేష్ నాయక్, మాతృ నాయక్,రాంలాల్ నాయక్, సేవ నాయక్, సక్రు నాయక్, దేగవత్ ప్రసాద్ నాయక్, రతన్ లాల్, బాబు నాయక్, వినోద్ నాయక్,పాల్గొన్న గ్రామ పెద్దలకు, మరియు యువకులకు,మహిళలు పాల్గొన్నారు.