పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కరించబడతాయి: జూలకంటి


నవతెలంగాణ దామరచర్ల: రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. దామరచర్ల మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన రూ 2 లక్షల రైతు రుణమాఫీ, రైతుబంధు పెంపు, రేషన్ కార్డులు, పేదవారికి ఇల్లు, ఇళ్ల స్థలాలులు పంపిణీ చేయడంతో పాటు మిగిలిపోయిన పోడు భూముల, పార్ట్ బి సర్వే చేయని భూములను సర్వే చేయించి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని కోరారు. నిరుద్యోగ సమస్యలు సమస్యలపై ఇచ్చిన హామీలను సత్వరమే అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. ఇప్పుడు నడుస్తున్న శాసనసభ సమావేశాలలో ప్రజా సమస్యల పరిష్కారంచడానికి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జరగడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.
ప్రజల సమస్యలపై అఖిలపక్షం ఏర్పాటు చేసి అన్ని పక్షాల అభిప్రాయాన్ని తీసుకొని రాష్ట్ర అభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కమ్యూనిస్టులు ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రజలతోనే ఉంటూ ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వినోద్ నాయక్ , సీనియర్ నాయకులు దయానంద్, ఎర్రనాయక్, కాజా మొహిద్దిన్, శ్రీహరి, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love