– సర్టిఫికెట్ల కోసం పడిగాపులు
నవతెలంగాణ-వీణవంక
రాష్ట్ర ప్రభుత్వం బీసీలను ఆదుకునేందుకు కుల వృత్తుల ఆధారంగా రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం కొన్ని కులాలను ఎంపిక చేసి వారికి అందజేయాలని సూచించింది. ఇందుకోసం కుల, నివాస, ఆదాయ దృవీకరణ పత్రాలను తప్పనిసరి చేసింది. దీంతో ఆశావహులు, సర్టిఫికెట్ల కోసం మీ సేవా కేంద్రాలతో పాటు తహసీల్దార్ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. దీంతో ఓకే సారి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేయడంతో సర్వర్ మోరాయిస్తోంది. దీంతో ఇటు ప్రజలు, మీ సేవా సెంటర్ల నిర్వాహకులు, అధికారులు తీవ్రంగా తిప్పలు పడుతున్నారు. ప్రజలు రోజంతా తహసీల్దార్ కార్యాలయం, మీ సేవా కేంద్రాల చుట్టు తిరిగినా ఫలితం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్వర్ ప్రాబ్లం లేకుండా చూడాలని, అలాగే ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.