స్వాతంత్ర్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే: ప్రొ. హరగోపాల్

నవతెలంగాణ హైదరాబాద్:
స్వాతంత్ర్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్.వినయకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో పిబి చారి రచించిన ‘ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ స్వరూపం – స్వభావం’ పుస్తకాన్ని హరగోపాల్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన ‘నీరుకారుతున్న స్వాతంత్ర్య విలువలు నిలువరించాల్సిన ఆవశ్యకత’ అనే అంశంపై మాట్లాడారు. ఈ సభలో పుస్తక రచయిత పిబి చారి, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు కె.ఆనందాచారి ప్రసంగించారు.

Spread the love