ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు: రేవంత్ రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రొఫెసర్ జయశంకర్ నిలిచిపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఈరోజు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ అన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి జాగృతం చేశారని పేర్కొన్నారు. తుది శ్వాస వరకు జయశంకర్ తెలంగాణ ఏర్పాటు కోసం పరితపించారన్నారు.

Spread the love