రెవెన్యూ విలేజ్‌గా ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామమైన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటను రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ గ్రామంగా గుర్తిస్తూ నిన్న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్కంపేట ప్రస్తుతం పెద్దాపూర్ రెవెన్యూ గ్రామంలో భాగంగా ఉంది. అలాగే, ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి-బి గ్రామంలో అమరవీరుల స్థూపం సమీపంలో స్మృతివనం అభివృద్ధి, సుందరీకరణ కోసం ఎకరం భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ జారీ చేసింది.

Spread the love