కేసీఆర్ పాలనలో తెలంగాణ అణచివేత: ప్రొఫెసర్ కోదండరాం

నవతెలంగాణ-  హుస్నాబాద్ రూరల్ 
సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలో అని చేతకు గురైందని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని వైశ్య భవన్ లో ప్రజా సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ప్రొఫెసర్ కోదాడ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న నిరంకుశ ప్రభుత్వనికి చరమగీతం పాడాలన్నారు. ధరణిలో తప్పులు ఉంటే సరి చేయడానికి కూడా డబ్బులు కట్టాల్సిందేనన్నారు. భూముల సమస్యలు ఉంటే గ్రామస్థాయిలో విచారణ చేసి సవరించాల్సిన అవసరం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేసీఆర్ కు సవాల్  చేస్తున్నానని, నిపుణులు చెప్పే ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలన్నారు. ఆప్పుడు మా డిమాండులను ఉపసంహరించుకుంటమని, లేకపోతే కేసీఆర్ నీవు నిమాటలను వెనక్కి తీసుకోవాలన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి ఏప్పుడు అన్యాయానికి గురవుతుందన్నారు. గెలువాల్సింది నువ్వు నేను కాదనీ, గెలవాల్సింది తెలంగాణ అని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్  మా మద్దతు ఉంటుందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన చరిత్ర ప్రభాకర్ ఉందన్నారు. రాష్ట్ర సంవారణను అంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కవ్వ లక్ష్మారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love