నవతెలంగాణ – ముంబాయి: స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఈరోజు నష్టాలతో ప్రారంభమయిన స్టాక్ మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతను మన మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 346 పాయింట్లు కోల్పోయి 62,622కి పడిపోయింది. నిఫ్టీ 99 పాయింట్లు పతనమై 18,534 వద్ద స్థిరపడింది.