నాట్కో ఫార్మాకు రూ.420 కోట్ల లాభాలు

– 350శాతం డివిడెండ్‌కు ఆమోదం
హైదరాబాద్‌ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ నాట్కో ఫార్మా 2023-24 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 31.2 శాతం వృద్థితో రూ.420.3 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.320.4 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.884.6 కోట్లుగా ఉన్న కంపెనీ రెవెన్యూ.. క్రితం క్యూ1లో రూ.1,140.5 కోట్లకు పెరిగింది. కంపెనీ వ్యయం రూ.533.1 కోట్ల నుంచి రూ.660.2 కోట్లకు చేరింది.

Spread the love