నవతెలంగాణ-లక్షెట్టిపేట
అసెంబ్లీ ఎన్నికల సమసయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్(సీఐటీయూ)ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి పిలుపు మేరకు మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయల ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం(సీఐటీయూ) మండల అధ్యక్ష, కార్యదర్శులు కాంతమ్మ, రబియా మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం నిర్వహాణను హరే రామ హరే కృష్ణ సంస్థకు అప్పగించాలనే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. కార్మికులకు ప్రతి నెల రూ.10 వేల వేతనం చెల్లించాలని అన్నారు. పెండింగ్ వేతనాలు, బిల్లులు, చెల్లించి ఇతర సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆగష్టు 21న ఛలో హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చెపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చీకటి సత్తక్క, మల్లవ్వ, ఎల్లవ్వ, మల్లీశ్వరి, లక్ష్మి, రజిత, పోసవ్వ పాల్గొన్నారు.