ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించండి

– ఎమ్మెల్యే కవ్వంపల్లికి విజ్ఞప్తి చేసిన రాసూరి మల్లికార్జున్‌
నవతెలంగాణ-బెజ్జంకి
మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు విజ్ఞప్తి చేసినట్టు మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆర్టీఐ ప్రచార కమిటీ చైర్మన్‌ రాసూరి మల్లికార్జున్‌ తెలిపారు. హైదరాబాదులోని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను అయన నివాసంలో మాజీ ఏఎంసీ చైర్మన్‌ అక్కరవేణీ పోచయ్య, రాసూరి మల్లికార్జున్‌, గాదం స్వామి, మిట్టపల్లి చెన్నారెడ్డి, పులి రమేశ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. మానకొండూరు నియోజకవర్గంలోని పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు వారి అనుచరులకు ధరణి పోర్టల్‌ సహాయంతో ప్రభుత్వ భూములను అక్రమ పట్టా మార్పిడి చేయించారని, గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో, నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. వెంటనే ప్రభుత్వ భూములను గుర్తించి ఆక్రమదారులను రికార్డుల నుంచి తొలగించి నిజమైన లబ్ధిదారుల పేర్లు యథావిధిగా నమోదు చేసి న్యాయం చేయాలని కోరినట్టు మల్లికార్జున్‌ తెలిపారు.

Spread the love