కబ్జా కాకుండా భూమిని కాపాడండి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్ పూర్ గ్రామ శివారులోని 349 సర్వేనెంబర్ లో ప్రభుత్వ భూమిని కోందరు కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వేంటనే ఆ భూమిలో కబ్జా కాకుండా భూమిని కాపాడాలని కోరుతూ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసిల్దార్ శ్రీనివాస్ రావు కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కుడా కోందరు అ భూని కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు దాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నప్పుడు దాన్ని కాపడం జరిగిందని వివరించారు. మళ్ళి కోందరు ముళ్ళ పోదలను చదును చేస్తున్నారని తేలుసుకుని అక్కడ ఉన్న రైతులు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారని విన్నవించారు. కబ్జాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ భూమిని కబ్జా కాకుండా కాపాడాలని వారు తహసిల్దార్ శ్రీనివాస్ రావు కు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, రైతులు, గ్రామస్తులు త లోదితరులు పాల్గొన్నారు.

Spread the love