
మన చుట్టూ నివసించే జంతు జాలాన్ని సంరక్షణ మనందరి బాధ్యత అని,జంతువుల సంక్షేమం కోసం ప్రతి పౌరుడు పాటుపడాలని పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు పిలుపునిచ్చారు.జంతు సంరక్షణ పక్షోత్సవాలు ముగింపు సందర్భంగా బుధవారం స్థానిక జిల్లాపరిషత్ బాలురు ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి లైన్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎ డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అడవులు, సరస్సులు, నదులతో పాటు వన్యప్రాణుల తో సహా సహజ పర్యావరణాన్ని, మెరుగుపరచటం వంటి కర్తవ్యం మానవులపై ఉందన్నారు. కార్యక్రమంలో పశువైద్య అధికారి డాక్టర్ స్వప్న, ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత, ఉపాద్యాయులు నరసింహారావు, కిషోర్ బాబు,
లైన్స్ క్లబ్ బాధ్యులు యుఎస్ ప్రకాష్ లు పాల్గొన్నారు.