మహిళలు ఆరోగ్యంగా అన్ని రంగాలలో వున్నప్పుడే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. అలాంటి మహిళలను కాపాడుకోవడం, ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ సమీపంలో గల స్నేహ సొసైటీ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంధుల వనరుల కేంద్రంలో మహిళ సెక్స్ వర్కర్లతో మహిళ సాధికారత మహిళ ప్రాముఖ్యతపై మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైసెస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మినిస్ట్రీ ఆఫ్ ఎం ఎస్ ఎం ఈ- డీఎఫ్ఓ – హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు కు ముఖ్య అతిథులుగా నగర మేయర్ దండు నీతూ కిరణ్, ఎం ఎస్ ఎం ఈ- డీఎఫ్ఓ- అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు. మహిళ ఆరోగ్యంగా వుంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. కుటుంబం ఆరోగ్యంగా వుంటే ఆర్థిక పురోగతి బాగుంటుంది అన్నారు. ఇలా ఒక్కో కుటుంబం ఆరోగ్యంగా ఆర్థిక పురోగతి వుంటే తెలియకుండానే దేశం ఆర్థిక పురోగతిలో ముందుంటుందన్నారు. దేశ ఆర్థిక పురోగతిలో మహిళల పాత్ర కీలకమన్నారు. ప్రస్తుత సమాజంలో ప్రతి మహిళ పురుషులకు ధీటుగా ముందుంటున్నారని తెలిపారు. ప్రభుత్వాలు సైతం మహిళల ఆర్థిక పురోగతి కోసం లోన్ లు సైతం అందిస్తుందని తెలిపారు. మహిళ సెక్స్ వర్కర్ల సమస్యలు, వారు ఆర్ధిక పురోగతి ఇతర విషయాలను మేయర్, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తమ వంతు బాధ్యతగా మహిళలకు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, గాంధీ ఆస్పత్రి సిబ్బంది మల్లికార్జున్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.
మహిళలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
నవతెలంగాణ – కంఠేశ్వర్