ప్రభుత్వ భూములకు రక్షణేది..!

– సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య సమ్మయ్య
– తాసిల్దార్‌ కార్యాలయం ముందు సిపిఎం రిలే దీక్షలు
నవతెలంగాణ – నెక్కొండ
నెక్కొండ మండలంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయిందని ఇష్టానుసారంగా ఆక్రమించుకుంటూ పోతున్నారని, రక్షించాలనే కలెక్టర్‌ ఆదేశాలను సైతం అమలుకు నోచుకోవడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య సమ్మయ్య అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టగా వారిపై కేసులు పెట్టే శ్రద్ద ప్రభుత్వ భూమిని రక్షించడంలో లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు భూక్య సమ్మయ్య. మండల కార్యదర్శి ఈదునూరి వెంకన్నతోపాటు కార్యకర్తలు, ప్రజలు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించి ప్రభుత్వ భూమిని రక్షించేంతవరకు దీక్షలు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సమ్మయ్య మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకత వహించి నెక్కొండలోని 436, 32/1లో గల భూములను రక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి రైతుబంధు పథకాన్ని పొందుతున్న బొబ్బల యాదవ రెడ్డి పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలన్నారు. హరిజన, గిరిజనులపై అక్రమ కేసులు బనాయించిన బొబ్బల యాదవ రెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సర్వేయర్‌, జిల్లా సర్వేర్లు కబ్జా కోరుతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్రభుత్వ అగ్నిమాపక కేంద్రాన్ని కూల్చివేసి దాని భూమిని సాగు చేస్తున్న బొమ్మల యాదవ రెడ్డి యదేచ్చగా తిరుగుతున్న చూసి చూడనట్టు వ్యవహరించడం హాస్యాస్పదమన్నారు. నెక్కొండ శివారులో, మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిని మరో 100 ఎకరాల భూమిని బయటపెట్టి పేదలకు పంచేంతవరకు మా యొక్క పోరాటాన్ని ఉద్ధతం చేస్తామని సిపిఎం మండల కార్యదర్శి ఈదునూరి వెంకన్న అన్నారు. కలెక్టర్‌ ఆదేశాలను అనుసరించి కబ్జాకోరుపై తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కవిత, రాధ,వీరమ్మ, కమలమ్మ, స్వప్న, హైమా, రమ, కవిత, సునీత,సంతోష,బుల్లి,సుభద్ర,బండి రామస్వామి, సోబియా, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love