నేడు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన

– మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సైదులు
– మాలలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపు
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకంగా నేడు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ సభ్యులు గోలి సైదులు తెలిపారు.
నల్లగొండ జిల్లా పరిషత్ విశ్రాంతిభవన్ లో ఆదివారం ఏబిసిడి వ్యతిరేక పోరాట సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1 ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. బిజెపి ప్రభుత్వం  మనువాద శక్తులు అంతా కలిసి సుప్రీంకోర్టు ద్వారా తీర్పును వచ్చేలా చేశారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి మను వాదుల కుట్రనే అని పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వెలువడిన తీర్పుకు ప్రత్యేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మాలలు అందరూ స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణను తిప్పికొడతామని, భవిష్యత్తులో ఏదైనా రాజకీయ పార్టీలు ఎస్సీలను విడదీయాలని చూస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. అదేవిధంగా ఆగస్టు 7, 8, 9, 10 తేదీలలో జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాలలంతా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం కార్యాచరణకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేకల సైదులు, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తెలగమల యాదగిరి, మాల సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షులు అద్దంకి రవి, మాల మహానాడు సీనియర్ నాయకులు చింతపల్లి లింగమయ్య, మాల మహానాడు నాయకులు పంబాల అనిల్, గండమల్ల శ్రీను, చింతమల్ల విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love