ఉప్పల్‌లో కేటీఆర్‌కు నిరసన సెగ…

నవతెలంగాణ – హైదరాబాద్
ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద కొత్తగా నిర్మించిన స్కైవాక్ ను మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. ఉప్పల్ లో కేటీఆర్ పర్యటనను నిరసిస్తూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఉప్పల్ పర్యటనకువచ్చిన మంత్రి కేటీఆర్ గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దాంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌తోపాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామంతపూర్‌ను దత్తత తీసుకుంటామని చెప్పి.. ఈ ప్రాంతంలోని భూగర్భ డ్రైనేజ్ పనులను ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరగలేదని, దళితబంధు ఇవ్వాలంటే లంఛం అడుగుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ పర్యటనను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Spread the love