పార్ట్ టైం లెక్చరర్ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని యూనివర్సిటీ లో నిరసన..

నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చర్లకు ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరుతూ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పార్ట్ టైం లెక్చర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ డి ప్రసన్న మాట్లాడుతూ పార్ట్ టైం లెక్చర్లను కూడా రెగ్యులరైజ్ చేయాలి లేదా ఉద్యోగ భద్రతను కల్పించాలని, ఏడాది లో కేవలం కొద్ది రోజులు మాత్రమే వర్క్ లోడ్ లభిస్తుందన్నారు. తద్వారా పార్ట్ టైం ఫ్యాకల్టీ చాలా నష్టపోతున్నారని  అల్మనక్ ప్రకారం వేతనాలు చెల్లించాలని పార్ట్ టైం అధ్యాపకులలో పిహెచ్ డి.సెట్ నెట్.  ఉన్న వాళ్ళు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం జూనియర్, డిగ్రీ లెక్చరర్ల వలె తమని కూడా పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ మద్దతు పలుకుతూ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షులు డాక్టర్ దత్తా హరి మాట్లాడుతూ పార్ట్ టైం అధ్యపకుల న్యాయమైన డిమాండ్లకు తాము కూడా అండగా నిలుస్తామని రెండు అసోసియేషన్లది ఒకటే డిమాండ్ అని, మనమంతా కలసి పోరాడుదా మన్నారు. విద్యార్థి సంఘాలు ముందుకు వచ్చి తమ మద్దతు పలుకుతూ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సయ్యద్ తాహేర్, అరిగెల హరిత, రఘువీర్, గంగాధర్, శ్రీనివాస్, కనకయ్య, చౌహన్, ఆఫ్రిన్, లింగమూర్తి, శీను నాయక్, శ్రీకాంత్ గౌడ్, నరేందర్, నవీన, గణేష్ నాయక్ కిషన్, విజయ్, సునీల్, విద్యార్థి నాయకులు సంతోష్, శివ, నవీన్, సాయి పవన్ లు పాల్గొన్నారు.
Spread the love