– నక్కలపల్లి బ్రిడ్జి వేసి బ్రిడ్జి పై నుండి నడుచుకుంటూ వచ్చి ఓట్లడుతానన్న కాలే యాదయ్య…
– ఇచ్చిన హామీలను మరిచారని గ్రామస్తుల ఆందోళన..
నవతెలంగాణ- మొయినాబాద్
ఎన్నికల ప్రచారంలో భాగంగా నక్కలపల్లి గ్రామానికి వచ్చిన కాలె యాదయ్యకు నిరసన సెగ ఎదురయింది 2014, 2018 ఎన్నికలలో గ్రామానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా తిరిగి మరల ప్రజలను మభ్య పెట్టాలనే ఉద్దేశంతో ఓట్లు అడగడానికి వచ్చిన ఎమ్మెల్యే కాలె యాదయ్యను కాంగ్రెస్ బిజెపి నాయకులు మరియు గ్రామస్తులు అడ్డుకుని నిలదీశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్యన వాగ్వాదం , తోపులాట జరిగింది. గ్రామస్తులు అడిగినటువంటి ప్రశ్నలకు ఎటువంటి సమాధానం బీజేపీతెలియజేయకుండా వెనుతిరిగి వెళ్లిపోయిన కాలె యాదయ్య