నవతెలంగాణ- తెలకపల్లి
నాలుగు సంవత్సరాలుగా బిఎల్వోలు పనిచేసిన బకాయి డబ్బులు చెల్లించాలని కోరుతూ బుధవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు బిఎల్వోలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా సీఐటీయూ నాయకురాలు డి చంద్రకళ మాట్లాడుతూ బీఎల్‌ఓ డ్యూటీలు నిర్వహించిన గత 4 సంవత్సరాలుగా ఎలాంటి వేతనం ఇవ్వలేదని మళ్లీ స్పెషల్ డ్రైవ్ పేరిట పనులు చెబుతున్నారని ఆయన వ్యక్తం చేశారు.బకాయి పడ్డ డబ్బులను వెంటనే ఇప్పించాలని బిఎల్‌ఓ మీటింగులకు వచ్చిన ప్రతిసారి టీఏ,డిఏలు ఇవ్వాలని ఇచ్చేటువంటి హాననోరియం ఎప్పటికప్పుడు నెలవారి అకౌంట్లో వేయాలని బిఎల్‌ఓ లకు మీసేవ కేంద్రాల వారికి కలిపి సమావేశం నిర్వహించాలని బిఎల్వోలు సర్వే కెళ్ళినప్పుడు వీఆర్‌ఏలు తోడుగా రావాలని వారు కోరారు. వారం రోజులలో బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున బీఎల్‌ఓ లందరిని కలుపుకొని ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు గోపాస్ లక్ష్మణ్, బీఎల్వోలు సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.