కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని నిరసన

నవతెలంగాణ – భిక్కనూర్
తెలంగాణ విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణంలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పనిచేస్తున్న 12 విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులను తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో రెగ్యులరైజ్ చేయాలని భిక్నూర్‌ మండలంలోని బి టి ఎస్ వద్ద ఉన్న దక్షిణ ప్రాంగణంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ ఎనలేని పోరాటం చేశారని తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తమ బతుకులలో మార్పులు వస్తాయని ఆశించిన ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లెదన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తమను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాలాద్రి, సునీత, నరసయ్య, వైశాలి శ్రీమాతా, రమాదేవి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love