– జూనియర్ డాక్టర్ల 144 గంటల సమ్మె
న్యూఢిల్లీ : వేతనాల్లో కోతలను నిరసిస్తూ బ్రిటన్ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. 144గంటల కార్యాచరణలో భాగంగా బుధవారం ఉదయం 7గంటల నుండి ఈ సమ్మె ఆరంభమైంది. ఎన్‌హెచ్‌ఎస్ చరిత్రలోనే సుదీర్ఘమైన ఈ సమ్మె జనవరి 9వ తేదీ మంగళవారం ఉదయం 7గంటలతో ముగుస్తుంది. శీతాకాలం ప్రారంభం కావడంతో వైరస్‌ల వ్యాప్తితో ఆరోగ్య సేవలపై ఒత్తిడి పెరగనున్న తరుణంలో సమ్మె ప్రారంభమైంది. ఇదిలావుండగా, తక్షణమే సమ్మెను విరమించి, చర్చలకు రావాల్సిందిగా ఆరోగ్య, సామాజిక సంక్షేమ విభాగం మంగళవారం బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్ (బిఎంఎ)ను కోరింది.